Skip to main content

Posts

Showing posts from February, 2026

జాతరలో తప్పిపోయిన చిన్నారిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి జామి జాతరలో మూడేళ్ల చిన్నారి తప్పిపోయింది. పలాస (M) కేదారిపురం గ్రామానికి చెందిన లికిత(3) తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తన సిబ్బందితో నిమిషాల వ్యవధిలో చిన్నారిని వారి తల్లిదండ్రు వద్దకు చేర్చారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు రాము, లలిత పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

పలాసలో జామి జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు: ఏఎస్పి రమణ

శ్రీకాకుళం జిల్లా  పలాసలో రేపు జరగనున్న జామి జాతరకు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు బుధవారం అడిషనల్ ఎస్పీ కె వి రమణ విలేకరులతో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇటు ట్రాఫిక్, అటు ఎల్లమ్మ తల్లి గుడి వద్ద సుమారు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ... జాతర సందర్భంగా జంట పట్టణాలలో ట్రాఫిక్ మళ్లించామన్నారు. జాతరలో యువకులు గలాటా చేస్తే.. వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మందస పరిధిలో సాగునీటి కోసం అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా  మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టు లను తెదేపా, ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11 వేల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు మరమ్మతులు అవసరం ఉందన్నారు. మరమ్మతులు చేయిస్తే మరో పదిహేనేళ్లు రైతులకు ఇబ్బంది ఉండదని,  అలా చేయగలిగితే మందస మండల రైతులు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటారన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

*𝟐𝟏𝐅𝐞𝐛𝟐𝟔 / 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒🤟🏽* * AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు * శాసనమండలిలో శ్రీవారి ఫొటోలతో వైసీపీ నిరసన * TG: HYDలో ఏఐ పవర్ రూం ఏర్పాటు చేయాలి: రేవంత్ * గోదావరి, కృష్ణా నీళ్లను ఆంధ్ర తరలించుకుపోతుంది: హరీష్రరావు * ట్రంప్ సుంకాలను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు * టీ20WCలో ఒమన్పై ఆస్ట్రేలియా ఘన విజయం * USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్ * AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం * APR 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్ * క్వాంటం కంప్యూటింగ్లో APదే పైచేయి: CBN * ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్ * CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి * ఏఐ వారూమ్కు HYD అనువైన ప్రదేశం: రేవంత్ * TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల 🌱 *-[|-----|]-* *✒️- 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽* 1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు 2013: HYDలోని దిల్సుఖ్నగర్లో వరుస పేలుళ్లు 1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం 1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం 1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం 2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒 * ప్రధాని మోదీ విందులో పాల్గొన్న రేవంత్ * TG: మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ * జైలు నుంచి విడుదలైన IBOMMA రవి * AP: అసెంబ్లీలో 'రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026'కు ఆమోదం * జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల * రూ.37 వేల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం * మహారాష్ట్రలో ముస్లింలకు విద్యలో 5శాతం రిజర్వేషన్ రద్దు * మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు * మదనపల్లె బాలికపై హత్యాచారం.. నిందితుడి ఆత్మహత్య * యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం * భారత్లో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం * నెదర్లాండ్స్పై పోరులో భారత్ విజయం.

ఎమ్మెల్యే శిరీష కృషితో మారనున్న పలాస ముఖచిత్రం

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 122 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలాస మున్సిపాలిటీ పరిధి కూటమి నేతలు కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల లేసి, బాణాసంచ కాలుస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం పలాస ఇందిరా చౌక్ వద్ద బాణాసంచా కాలుస్తూ... పలాస అభివృద్ధి కొరకై నిరంతరం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే శిరీష కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లోడగల కామేశ్వరరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్, మల్లిపెద్ది చిన్ని, గురిటి సూర్యనారాయణ, గోల చంద్రరావు, అంబటి కృష్ణమూర్తి, అనీల్ శర్మ, సవర రాంబాబు డొక్కరి శంకర్, రవి శంకర్ గుప్తా, మళ్ళా శ్రీను, కొత్త సత్యం, దడియాల్ నర్సింగరావు, జోగ మల్లి, సార నోములరావు, తిరునాగర్ తిరుపతిరావు, పాండు రంగారావు, ధనుంజయ్ రావు, బుడత జగదీష్, బర్ల కృష్ణ, కొరికిన శంకర్, తివడాన శంకర్, పట్ట మల్లేష్,  ch రామకృష్ణ, ఇప్పిలి చణిక్య, కృష్ణా...

పలాసలో నేడు ఆ ప్రాంతాలకు పవర్ కట్

పలాస సబ్ స్టేషన్ పరిధిలో 11 కె.వి పీడర్ లైన్ మరమ్మత్తులు కారణంగా నేడు పలు ప్రాంతాలకు విద్యుత్ కు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొగిలిపాడు, ఉదయపురం, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు, శాసనాం, ఆసుపత్రి రోడ్డు, రోటరీ నగర్, సూది కొండ, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు, న్యూ కాలనీ, ఫిష్ మార్కెట్, హరిజన వీధి ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందని పలాస డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి యజ్ఞేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు.... ➡️ ఓటు నోటు కేసులో ఆధారాలు ధ్వంసం కాలేదు: రేవంత్ ➡️ 2029లోనే జమిలీ ఎన్నికలు: రేవంత్ ➡️ TGలో ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం ➡️ లడ్డూ వ్యవహారంపై ప్రశ్నిస్తేనే కేసులు: జగన్ ➡️ అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ ➡️ 114 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ➡️ బంగ్లాదేశ్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ➡️ నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు: సీఎం రేవంత్ ➡️ ఒక్క ఐటీ జాబ్తో ఆరుగురికి ఉపాధి: మంత్రి లోకేశ్ ➡️ లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్ ➡️ రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ➡️ నమీబియాపై భారత్ ఘన విజయం ➡️ స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు🌱

వృద్ధురాలు కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి చోరీ కేసులో నిందితులు అరెస్ట్.

శ్రీకాకుళం జిల్లా పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు మైనర్ బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.5 లక్షలు నగదు అర తూలం బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల వీధికి చెందిన మళ్ళా  ప్రేమకుమారి( వృద్ధురాలు)కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి రూ. 2.8 లక్షలు, అర తూలం బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ జరిగిన కేవలం ఒక్కరోజులో నిందితులను పట్టుకున్నట్లు సోమవారం డిఎస్పి షేక్ సహబాజ్ అహమ్మద్ తెలిపారు.

కాశీబుగ్గలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రోటరీ నగర్ లో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రోటరీ నగర్ కు చెందిన సునీత పాత్రో ఇంట్లో ఇటీవల 5 తులాల బంగారం చోరికి గురైంది. చోరీ జరిగిన కేవలం ఒక్క రోజులో నిందితులను పట్టుకున్న సీఐ రామకృష్ణ తోపాటు సిబ్బందిని సోమవారం డిఎస్పి షేక్ సహబాజ్ అహమ్మద్ అభినందించారు.

పలాస అభివృద్దే నాధ్యేయం : ఎమ్మెల్యే గౌతు శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17వ తిలక్ నగర్ లో శ్రీ మంకినమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు రూ. 20 లక్షల సాధారణ నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ను ఆమె ప్రారంభించారు. 13వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. 5వ వార్డు తాళబద్ర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్, మురుగు కాలువ పనులకు శంకుస్థాపన చేసి, రాజాం కాలనీలో సుమారు రూ. 11 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రతి వార్డులో ఉన్న మీ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని ఇందుకు మీరంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ బల్ల గిరిబాబు, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, దువ్వాడ శ్రీకాంత్, బడ్డా నాగరాజు, చిన్ని కొత్త సత్యం, రామకృష్ణ, తిరుమలరావు, లోడగల కామేశ్వరరావు, గురుటి సూర్యనారాయణ, సవర రాంబాబు, గాలి కృష్ణారావు, శంకర్, సప్...

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ * ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన KCR విచారణ * బడ్జెట్లో TGకి అన్యాయం: భట్టి * తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది: CBN * జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన TDP శ్రేణులు * రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోంది: జగన్ * U-19 WC: పాక్పై విజయం.. సెమీస్కు భారత్ * నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ * రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు * ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM * ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్ * దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN * కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: భట్టి * కేసీఆర్ను 4.50 గంటలు విచారించిన సిట్ * T20WC: INDతో మ్యాచ్ను బాయికాట్ చేసిన పాక్ * కవలలకు జన్మనిచ్చిన రామ్చరణ్ దంపతులు🌱