శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డవూరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు వంక యాదవరావు (52) సముద్రంలో చేపల వేటకు వెళ్లి మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళగా... రాకాసి అలలకు తెప్ప బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మత్స్యకారులు తీరానికి చేరుకోగా... యాదవరావు పై తెప్ప బోల్తా పడటంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.