పలాస నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు వైద్య పరంగా ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం అందించారు. 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 19.62 లక్షల చెక్కులను పలాస టిడిపి కార్యాలయంలో వారికి అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.