శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పొందూరుపుట్టుగ గ్రామంలో మూడు రోజులు ఘనంగా వినాయక పూజలు నిర్వహించి నేడు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ముందుగా 11 కిలోల లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొందూరు అశోక్ తన 10 నెలల చిన్నారి పేరున రూ. 65 వేలుకు సొంతం చేసుకున్నారు. దీంతో ఊరేగింపుగా లడ్డు ప్రసాదాన్ని గ్రామ దేవత శ్యామలమ్మ గుడికి తీసుకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.