శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బసవకొత్తూరు గ్రామంలో శనివారం ఉదయం వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ ను వెలిగించగా ఒకసారిగా మంటలు చెలరెగాయి. ఈ ప్రమాదంలో అత్తా కోడలు పిట్ట మహాలక్ష్మి, కుమారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆహాకారాలు విన్న పక్కింటి మహిళ నీలగిరి భాగ్యవతి వీరిని సహాయం చేసేందుకు వచ్చి తీవ్రంగా గాయపడింది. ముగ్గురు మహిళలను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.