దైవదర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటినే దొంగలు దోసేసారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు(M) పాతటెక్కలి గ్రామానికి చెందిన మల్ల భూపతిరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 5వ తేదీన విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించేందుకు వెళ్లి సోమవారం ఇంటికి తిరిగివచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, కేజీన్నర వెండి తోపాటు 4 లక్షల 37 వేల నగదును దొంగలు దోచుకెళ్ళినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ తిరుపతిరావు, ఎస్సై నిహార్ సిబ్బందితోపాటు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.