రానున్న గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రజలు ఆన్లైన్ (సింగల్ విండో సిస్టం) ద్వారా అనుమతులు తీసుకోవాలని కాశీబుగ్గ డిఎస్పి భవాని గురువారం తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో, పరస్పర అంగీకారంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం కలిగిన స్పీకర్లు వాడవద్దని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.