ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం పలాస ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు సిబ్బందితో కలిసి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr పాపినాయుడు మాట్లాడుతూ... బాల్యం నుంచే చిన్నారులకు ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేయాలని తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్న ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వ టెలి మానస్ 14416 నెంబర్ కి ఫోన్ చేసి ఉచిత వైద్య సలహాలు పొందవచ్చు అని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.