విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందాలు వెల్లివిరియాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. మట్టి వినాయక విగ్రహాలకు పూజలు జరుపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.