కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మలేషియాలో చిక్కుకున్న యువకులు గురువారం స్వదేశానికి రానున్నారు. ఉపాధి కోసం మలేషియా వెళ్ళిన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్, సోంపేట(M) ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీ తో పాటు మరో యువకుడు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.. ఆగస్టు 12వ తేదీన ఉపాధి నిమిత్తం విజిటింగ్ వీసాపై వెళ్లిన యువకులను ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. పండగపూట వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ.. ఎమ్మెల్యేలు శిరీష, అశోక్ ల ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కు సమాచారం అందించారు. స్పందించిన రామ్మోహన్ నాయుడు విదేశాంగ శాఖ మంత్రి ద్వారా మలేషియా ప్రభుత్వంతో చర్చలు జరిపి క్షేమంగా యువకులను తిరిగి స్వదేశానికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో గురువారం నలుగురు యువకులు స్వదేశానికి రానున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.