పలాస అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో రైజింగ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అగ్ని పర్వతాల మధ్యలో భారీ గణనాధుని విగ్రహం ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గణేశుని విగ్రహం భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. నేటి నుంచి నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామని, మట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టిందని కమిటీ సభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.