ఆర్నబ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం - 9701400865, టెక్కలి - 9490610050, పలాస - 08945241084. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి మండలాల పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.