శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ (రీసెర్చ్ సెంటర్) ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విధుల్లో ఉండాల్సిన డాక్టర్స్, వైద్య సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మంది డాక్టర్లు ఉండగా... కేవలం ఇద్దరు మాత్రమే సమయానికి విధి నిర్వహణలో ఉన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.