శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన కూను జోసెఫ్, సుజాత దంపతుల కుమారునుకి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కుటుంబంతో సంబంధం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతీ యువకుల వివాహం అక్కడ ఘనంగా జరిగింది. వివాహ వేడుకను ఆన్లైన్ ద్వారా వీక్షించిన తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుమారుడి పెళ్లిని కళ్లముందే చూసుకుంటూ ఆనందంతో మురిసిపోయారు. ఖండాంతరాల దూరం ఉన్నప్పటికీ టెక్నాలజీ తమను వివాహ వేడుకలో భాగస్వాములను చేసిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.