శ్రీకాకుళం జిల్లా కవిటి(M) బొరివంక గ్రామానికి చెందిన ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా - కదళీ కుసుమ గణపతిని తయారు చేశారు. అరటి చెట్టులోని పువ్వులు, ఆకులు మొదలగు అరటి ఉత్పత్తులతో గణనాథుడు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 2012 నుండి ఇప్పటివరకు వివిధ గణపతి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. శిల్పి బైరి తిరుపతి ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగిందని యూత్ క్లబ్ అధ్యక్షులు దీనబంధు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.