కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని మంగళవారం ఏపీటీపీసి చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు. సందర్భంగా విద్యార్థులకు ప్రతిరోజు అందుతున్న పౌష్టికాహారం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెనూ అమలు చేయాలని భోజన నిర్వాహకులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు AMC చైర్మన్ మల్ల శ్రీను, లోడగల కామేశ్వరరావు, మల్లిపెద్ది నరేంద్రబాబు(చిన్ని), గాలి కృష్ణారావు, శాసుమాన చంద్రమౌళి యవ్వారి మోహనరావు, నాబిల్లి శ్రీను, తుంగాన దేవరాజు, శంకు శ్రీకాంత్, బంగారి కేదార్నాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.