పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడు కొత్త వీధిలో యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహేంద్రగిరి పై ఉన్న భీముడు కొండలో కొలువైన గణేశుని ఏర్పాటు చేశారు. ఈ సెట్టు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీన్ని నిర్మించేందుకు సుమారు వారం రోజుల సమయం పట్టిందని కమిటీ సభ్యులు తెలిపారు. పూజ ఏర్పాట్లకు తిమ్మల నారాయణ, కుమ్మరి ముకింద, వాడరేవు అశోక్, కీలు హరీష్, తిమ్మాల ప్రశాంత్, సైని జగన్నాధం, సైని సింహాచలం,సొర్ర శివ, సైని రంగా సహకరించారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.