శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురం రైల్వే అండర్ పాస్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో నిండిపోయింది. సమీప గ్రామ ప్రజలు విషయాన్ని గ్రహించి ఈ అండర్ పాస్ ద్వారా రాకపోకలు చేయకుండా ఉండాలని కాశీబుగ్గ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. సమీపంలో ఉన్న లక్ష్మీపురం టోల్ ప్లాజాలో వాహనాలకు ఉన్న ఫాస్టాగ్ (FASTag) రుసుము తప్పించుకునేందుకు వాహన దారులు ఈ మార్గం ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేయవద్దని ఆయన సూచించారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.