వినాయక చవితి సందర్భంగా వంట గదిలో ఉపయోగించే పప్పు దినుసులతో వినాయక విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ గాంధీనగర్ లో కొత్తపల్లి రమేష్ ఆచారి తయారు చేశారు. సుమారు 35 రకాల పప్పు దినుసులు ఉపయోగించి, ఈ విగ్రహాన్ని తయారీకి నాలుగు గంటల సమయం పట్టినట్లుగా ఆయన తెలియజేశారు. పప్పు దినుసుల వినాయకుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.