శ్రీకాకుళం జిల్లా కేంద్రం పోలీసు కార్యాలయంలో డయల్-112, 6309990933 కంట్రోల్ రూమ్‌లతో పాటు, జిల్లాలోని మూడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి మంగళవారం ఒక ప్రకటన రూపంలో తెలిపారు.శ్రీకాకుళం డీఎస్పీ 6309990804, కాశీబుగ్గ డీఎస్పీ 6309990805, టెక్కలి డీఎస్పీ 6309990811, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 6309990911 నంబర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.