➣కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటిన ఆర్నాబ్ తుఫాను➣జిల్లా వ్యాప్తంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం➣టెక్కలి, ఎల్ ఎన్ పేట మండలాల పరిధిలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు➣ఇచ్చాపురం, ఆమదాలవలస మండలాల పరిధిలో కూలిన ఇంటి గోడలు➣పలాస మండల పరిధిలో రోడ్డుపై పొంగి పొర్లుతున్న వరహాలగెడ్డ➣తీరం వెంబడి అల్లకల్లోలంగా మారిన సముద్రం➣ జిల్లావ్యాప్తంగా వేలాది హెక్టార్లు నీట మునిగిన వరి పంట.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.