TG: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాసన్నపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి సూసైడ్ చేసుకుంది. సంస్కృతి టౌన్షిప్ సమీపంలోని అపార్టమెంట్లో నివాసముంటున్న మౌనిక (26) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. కాగా... వైజాగ్‌కు చెందిన రమాకాంతను ప్రేమించి. కులాంత వివాహం చేసుకొని సంస్కృతి టౌన్షిప్లో నివాసముంటున్నారు. ఇవాళ భర్త ఇంటిలో ఉండగానే భార్య సూసైడ్ చేసుకుంది. వీరికి రెండున్నరేళ్ల కవల కుమారులున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.