అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టిసి బస్సు ఆనందపురం సమీపంలో ఉన్న విజయనగరం క్రాస్ రోడ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆర్టిసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వరుసుగా సెలవులు కావడంతో బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.