శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాల హోరు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం 4వ వార్డు అంబుసోలి గ్రామంలో కూటమి అభ్యర్థి చెల్లూరి శకుంతుల, రామకృష్ణతో కలిసి చైర్ పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండున్నర కాలంలో కూటమి ప్రభుత్వం పుర ప్రజలకు అందించిన అభివృద్ధిని గుర్తించి కూటమి అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో పలాస పట్టణ రూపు రేఖలను మార్చుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, బడ్డా నాగరాజు, మల్లిపెద్ది చిన్ని, గాలి కృష్ణారావు, జనసేన నాయకులు గొజ్జ దేవరాజుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.