Skip to main content

Posts

Showing posts from January, 2026

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* నక్సల్స్ వంకతో నా ఫోన్ ట్యాప్ చేశారు: TPCC చీఫ్ * సింగరేణిలో సోలార్ స్కాం జరిగింది: హరీష్ రావు * మా ఫోన్లు ట్యాప్ కాలేదా అని సిట్ను ప్రశ్నించా: KTR * MSMEలో క్రెడిబిలిటీ, బ్రాండింగ్కు ప్రాధాన్యత: CBN * అనగాని సంస్కారం మర్చిపోయారు: పేర్నినాని * శబరిమల బంగారం చోరీపై విచారణ జరిపిస్తాం: మోదీ * WHO నుంచి వైదొలిగిన అమెరికా * తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ * ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు * ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ * పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR * తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI * రెండో టీ20లో NZపై భారత్ విజయం

ఆప్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అధికారులు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఆప్షోర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఈ ఈ శేఖర్ తన సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది నీటి సంఘ అధ్యక్షులు నిరంజన్ పాల్గొన్నారు.

లొద్దబద్ర గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 300 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

బ్రాహ్మణతర్ల గ్రామంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో పశు వైద్య అధికారి కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 186 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి: మోదీ * తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనుమ వేడుకలు * AP: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ * కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం ఉత్సవాలు * TG: గ్రూప్-3కి ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేత * ఆన్లైన్లో వేధింపులు.. పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు * 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్ * ఉమ్మడి ఆదిలాబాద్లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం * మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం * మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల * ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్ * రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్ * 'సంక్రాంతి' తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ🌱

అక్రమాలపై ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా...?

శ్రీకాకుళం... అక్రమాలపై ప్రశ్నిస్తే... మాపై దాడులు చేస్తారా..? కాశిబుగ్గ పట్టణంలో అక్రమాలను ప్రశ్నించినందుకు నా విద్యా సంస్థలు(సూర్య తేజ)పై దాడులు చేస్తూ... గత 15 సంవత్సరాలుగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దానేటి పద్మజ మంగళవారం మీడియాతో వాపోయారు... అంతేకాకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ... ఓ వార్త సంస్థ నిజాలు తెలుసుకోకుండా వార్తను ప్రచురించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నాపై మానసిక, భౌతిక దాడులకు పాల్పడిన వారితో పాటు... అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* సోమ్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ * TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్ను: రేవంత్ * టికెట్ల ధరల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి * TG మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ * AP: నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదు: CBN * జనగణన 2027కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు * WPL 2026: UPపై గుజరాత్ విజయం * AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN * శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్ * అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల * TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్ని: రేవంత్ * సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి * తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన * 'అల్మాంట్-కిడ్' సిరప్పై నిషేధం విధించిన ప్రభుత్వం * సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ

పండక్కి ఊరు వెళ్తున్నారా..? అయితే సమాచారం ఇవ్వండి: డిఎస్పీ

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శనివారం డి.ఎస్.పి షేక్ సహబాజ్ అహమ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లినట్లయితే కచ్చితంగా పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లకు (ఎల్ హెచ్ ఎం ఎస్) సిస్టం అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచరాదని సూచించారు.

అర్ధరాత్రి దాటిన వేళ ఇచ్చాపురం పట్టణంలో రెచ్చిపోయిన దొంగలు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఇళ్లకు తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీ ఘటనలో ఎంత బంగారం, డబ్బు కొల్లగొట్టారు తెలియాల్సి ఉంది.

పలాసలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు యువకులు

శ్రీకాకుళం జిల్లా పలాస(M) బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ గంజాయిను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు చిన్నచిన్న ప్యాకెట్లుగా గంజాయిను తయారుచేసి యువతకు అమ్మేవారు. ఒడిస్సా రాష్ట్రం బరంపురం పట్టణానికి చెందిన పప్పు అనే వ్యక్తి వద్ద సుమారు నాలుగు కిలోల గంజాయి కొని గోనెసంచిలో తరలిస్తుండగా కంబ్రిగాం బ్రిడ్జ్ సమీపంలో... పోలీసులు కు పట్టుబడినట్లు కాశీబుగ్గ డి.ఎస్.పి షేక్ సహబజ్ అహ్మద్ బుధవారం మీడియాతో తెలిపారు.

పలాసలో 5వ రోజుకు చేరుకున్న ఎన్ఎస్ఎస్ శిక్షణ శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మంగళవారం నాటికి ఐదవ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ అటవీ శాఖ డివిజన్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. అటవీ జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, అధ్యాపకులు కోదండరావు తదితరులు పాల్గొన్నారు.

పలాసలో నారీ శక్తి పై అవగాహన కల్పించిన డిఎస్పీ

పలాస(M) లక్ష్మీపురం గ్రామంలో సోమవారం డీఎస్పీ షేక్ సహబబ్ అహ్మద్ ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

విజయనగరం జిల్లా పూసపేటరేగ(M) చింతల అగ్రహారం గ్రామ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) కాపు తెంబూరు గ్రామానికి చెందిన గజరావు నగేశ్(31) గా పోలీసులు గుర్తించారు. లగేజీ వ్యాన్ తో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్న నగేష్ జాతీయ రహదారి ప్రక్కన వాహనాన్ని ఆపి కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య భవాని తో పాటు ఐదేళ్ల పాప ఉన్నారు.

సిక్కోలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య.

శ్రీకాకుళం జిల్లా సోంపేట(M) బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే...  బారువ ఆసుపత్రి చికిత్స పొందుతూ మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులు ఒడిస్సా వాసులుగా గుర్తించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి... నలుగురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో  లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బారువ ఆసుపత్రికి తరలించారు.

ఇచ్చాపురంలో వైకాపా కు భారీ షాక్ తగలనుంది...

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగలనుంది.  కవిటి మండలం నెలవంక గ్రామంలో నేడు(ఆదివారం) ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో వైకాపా ను వీడి టిడిపిలోకి భారీ చేరికలు రానున్నాయి. సర్పంచ్ దుర్గాశి కుమార్ మోహన్ రెడ్డి తోపాటు సుమారు 50 కుటుంబాలు పసుపు కండువా కప్పుకొనున్నాయి .

గోడ కూలి మహిళా కార్మికురాలు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా... మహిళా కార్మికులపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికరాలు  అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కార్మికురాలు కీలు దుర్గమ్మ (32) తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు....

* తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులకు ఆమోదం * ఈ అసెంబ్లీ సెషన్ను బహిష్కరించిన బీఆర్ఎస్ * AP: రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ * విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం * తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దు * అసభ్యకర కంటెంట్పై ట్విట్టర్కు నోటీసులు * ‘ఉపాధి' పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలంటూ TG అసెంబ్లీలో తీర్మానం * రూ.7వేల Crతో HYDకు గోదావరి జలాలు: CM రేవంత్ * పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CM CBN * ఫోర్బ్స్ డేటా.. FY-2026లో పెట్టుబడుల్లో AP టాప్ * కూటమి దౌర్జన్యాలను తిప్పికొడతాం: YS జగన్ * తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన BRS * KCR సభకు రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్న కవిత🌱

నేడు జిల్లాకు రానున్న హోం శాఖ మంత్రి అనిత

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. .. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ యాత్ర నేడు(శనివారం) ఇచ్చాపురంలో ముగియనుంది. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు స్థానిక ఎమ్మెల్యే అశోక్ పాల్గొననున్నారు.

పలాసలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస(M) రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో కూడిన కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గడిచిన ప్రభుత్వంలో ఓ తుగ్లక్ పాలన చూసామని, మన తాతలు, తండ్రిల ఆస్తుల పుస్తకాలపై తుగ్లక్ (జగన్) ఫోటోతో ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్వర్ణ గ్రామం (సచివాలయం)లో పిర్యాదు చేస్తే వారం రోజుల్లో సరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్ రావు, యూనిట్ కన్వీనర్ కుత్తుం ప్రకాష్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లీన శ్రీను, సీనియర్ నాయకులు గోరకల దాసు తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.