Skip to main content

Posts

Showing posts from December, 2025

ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలానికి పూర్తయిన అంత్యక్రియలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.

పలాస జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మొదలైన ఉద్యమం.

పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విభజించి పలాస కేంద్రంగా జిల్లా నాయకులు ప్రకటించాలని కోరారు. ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా పోరాడుతాం అని ఆయన ప్రకటించారు. ఆయన పిలుపుమేరకు పలు ప్రజాసంఘ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు.

పలాసలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండవ వార్డ్ నెమలికొండ దరి ఉన్న దత్తాత్రేయ ఆశ్రమం వద్ద 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారు రూ. 11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.

డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సాయి కాలనీలో గురువారం డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పలాస డివిజన్ పరిధిలో ఉన్న  8 మండలాల పరిధిలో ఉన్న సచివాలయ పరిపాలన వ్యవస్థను ఈ కార్యాలయం నుంచి అనుసంధానంతో నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

జాతీయ రహదారిపై అర్థరాత్రి దాటిన వేళ (BT)దోపిడి..!

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ పరిధిలో అర్థరాత్రి దాటాక జరుగుతున్న అక్రమాలు నందిగాం, టెక్కలి, కోటబొమ్మాలి మండలాల పరిధిలో జాతీయ రహదారిపై నిల్వ ఉంచిన (BT) అక్రమంగా తరలిపోతున్న వైనం... జెసిబిలు సహాయంతో ట్రాక్టర్ల పై తరలిస్తున్న వైనం... ఈ అక్రమ తరలింపుకు గురైన(BT)పై వస్తున్న సొమ్ము ఎవరి జోబిలోకి వెళ్తుందో..!    ----- మరిన్ని పూర్తి వివరాలతో

జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్.  జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.

పలాసలో టోల్ సిబ్బందికి నేటికీ అందని దీపావళి బోనస్

శ్రీకాకుళం... నేటికీ దీపావళి బోనస్ అందుకోలేని టోల్ సిబ్బంది..!  విషయంపై ప్రశ్నించిన టోల్ సిబ్బందిపై పరోక్ష దాడులకు పాల్పడుతున్న యాజమాన్యం. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజాలో ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న పలు కార్మిక సంఘ నాయకులు. మరోవైపు కూటమి ప్రభుత్వం పేరు చెబుతూ... నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు టోల్ సిబ్బంది గుసగుసలు ఆడుతున్నట్లు సమాచారం...!

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనడంతో.. ఘటనా స్థలంలో పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే..  తీవ్ర గాయాలు పాలైన గుంట రాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు. చేతికందిన కొడుకులు అర్ధాంతంగా తనువు చాలిస్తే... ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి రాయలేని పరిస్థితి.

పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుదాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీడియా సాక్షిగా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రకటించి, నేడు అసెంబ్లీలో ప్రకటించిన జిల్లాల్లో పలాస పేరు లేకపోవడం చాలా బాధాకరమని పలాసకు చెందిన దువ్వాడ శ్రీధర్ (బాబా) మీడియాతో తెలిపారు. భౌగోళికంగా పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.   ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి పలాసను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను విభజించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు శాంతియుతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.